శ్రీరామ నవమి ప్రత్యేకం, ఈ పాటతో భక్తి పారవశ్యం

హిందువుల అతి ముఖ్యపర్వదినాల్లో శ్రీరామ నవమి ఒకటి.  ఈ పండుగను భారతీయు అందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ  జరుపుకుంటూంటారు. 
 ఈ నేపధ్యంలో శ్రీరామ నవమి వస్తోందంటూ అందరికీ ఉత్సాహమే..ఉల్లాసమే..భక్తి పారవశ్యమే.  అందుకే..కెకెఎన్ కె టీవి వారు శ్రీరామ్ ధున్ అనే పాటను రెడీ చేసారు. కృష్ణ భట్ట, శ్రీ రాఘవేంద్ర రాసిన ఈ పాటను ప్రముఖ గాయకుడు హరిహరన్ పాడటం విశేషం.
 ఎవియన్ పవన్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటకు లిప్సిక ఫిమేల్ వాయిస్ ని అందించారు. మరో విశేషం ఏమిటి అంటే వీళ్లిద్దరూ తెలుగు వాళ్లే హైదరాబాద్ నుంచి వచ్చిన వారే కావటం.  హరిహరన్ గురించి అయితే ఇక చెప్పక్కర్లేదు. ఆయన పాడిన ఎన్నో బాలీవుడ్, టాలీవుడ్ పాటలు మన మనస్సుల్లో సుస్దిర స్దానం ఏర్పాటు చేసుకున్నాయి. 
ఇక ఈ పాటను రామ్ మందిరం మూవ్ మెంట్ కు అంకితం చేస్తున్నారు. ఈ పాట ఖచ్చితంగా మీ మనస్సులను ఆకట్టుకుంటుంది. మీ హృదయాలను సూటిగా తాకుతుంది. అంతేకాదు ఈ వీడియోని ఓ విజువల్ ట్రీట్ గా కూడా రూపొందించారు. ఈ పాటను వినండి, చూడండి…మీ స్నేహితులతో పంచుకోండి. జై శ్రీరామ్.