భగవద్గీతని పూర్తిగా అర్దం చేసుకుంటూ వినే అద్బుత అవకాసం

ఎక్కడైనా భగవద్గీత వినిపడగానే… మన మనస్సులో ఒకటే ఆలోచన. ఎవరో చని పోయినట్లు ఉన్నారు అని. అవును అది నిజం.. అలా మనస్సుల్లో తప్పుడు ముద్ర ముద్రితమైపోయింది. భగవద్గీత అనగానే అది కేవలం సన్యాసులకో, ముసలివారికో ఉద్దేశించిన పుస్తకంగా భావిస్తూంటాం.అలాగే మనందరికి భగవద్గీత అనగానే ఘంటశాల స్వరపరిచిన శ్లోకాలు గుర్తు వస్తాయి. అదీ ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే వినదగినది అనుకుంటూ ఉంటాం. అంతేకాని మరణానికి, భగవద్గీత వినటానికి సంభంధం లేదని, కేవలం కాకతాళీయంగా ఆ సమయంలో వింటే కాస్త ధైర్యం వస్తుందని చెప్పటంతో..మన ఆప్తులు మరణించినప్పుడు దాన్ని వింటూ వస్తున్నాం. అయితే కాలం గడిచేసరికి… ఇప్పుడు అదో శవ సంప్రదాయంగా మారి.. ఆ సమయంలో ఖచ్చితంగా వినాలని, కేవలం అప్పుడే వినాలని మానసికంగా గత కొన్ని ఏళ్లుగా ఫిక్సైపోయాం. దానికి తగినట్లు ఆ రోజు పెద్ద మైకులో భగవగ్దీతను పెట్టడం,చనిపోయిన వారి పేరట భగవద్గీను పంచటం చేస్తూంటారు. ఇంకాస్త ముందుకు వెళితే మనకు భగవగ్దీత అనగానే కోర్టులో ..నిందితుడు చేత భగవగ్దీత సాక్షిగా అంతా నిజమే చెప్తాను అనటం గుర్తువస్తుంది.